మెగా హీరో అల్లు శిరీష్ కెరీర్ ప్రారంభించి చాలా కాలం అయ్యింది. సినిమా సినిమాకు ఈయన తన స్టార్డంను తగ్గించుకుంటున్నాడు. మెగా అనే ఒక ట్యాగ్ ఉండటం వల్ల ఈయన కెరీర్ అలా అలా ముందుకు సాగుతుంది. ఇటీవల ఈయన చేసిన ఏబీసీడీ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. వరుసగా ఫ్లాప్స్ వస్తున్న కారణంగా శిరీష్ సినిమాల సంఖ్య చాలా తగ్గించాడు. ఏబీసీడీ వచ్చి ఏడాది కాబోతున్న నేపథ్యంలో తదుపరి చిత్రం విషయమై చర్చలు స్పీడప్ చేశాడు. శిరీష్ తర్వాత సినిమా దాదాపుగా ఖరారు అయినట్లుగా సమాచారం అందుతోంది.
ఏబీసీడీ చిత్రంను ఒక కన్నడ మూవీ నుండి రీమేక్ చేశాడు. ఇప్పుడు శిరీష్ తర్వాత సినిమాను కూడా ఒక తమిళ మూవీ నుండి రీమేక్ చేయబోతున్నాడు. తమిళంలో ఒక యువ దర్శకుడు తెరకెక్కించిన మూవీ సక్సెస్ అయ్యింది. ఆ మూవీని తెలుగులో అదే దర్శకుడి దర్శకత్వంల రీమేక్ చేయాలని అల్లు శిరీష్ నిర్ణయించుకున్నాడు. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమాను మార్చుతున్నట్లుగా సమాచారం అందుతోంది.