Site icon TeluguMirchi.com

అల్లు శిరీష్ వాలెంటైన్ గిఫ్ట్ !

allu sirishఅల్లు శిరీష్, రెజినా జంటగా దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కొత్త జంట. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

‘కొత్త జంట’ చిత్రంలో చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం 786’ చిత్రంలోని ‘అటు అమలాపురం … ఇటు పెద్దాపురం’ పాటను రీమిక్స్ చేస్తున్నారు. ఈ పాట చిత్రానికి హైలెట్ నిలుస్తుందని యూనిట్ చెబుతోంది. ఇక బూతు చిత్రాల డైరెక్టర్ గా ముద్రపడ్డ మారుతి ఈ సినిమాలో మాత్రం ఏలాంటి అసభ్యతకు తావు లేకుండా ఫుల్ లెంగ్త్ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తునట్టు సమాచారం. గౌరవం చిత్రంతో ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక పోయిన శిరీష్ ఈ ‘కొత్త జంట’ తో హిట్టు కొట్టి కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కం చెప్పాలనుకుంటున్నాడు. మరి ‘కొత్త జంట’ శిరీష్ కుఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Exit mobile version