అల్లు అర్జున్ ఒక వైపు స్టార్ హీరోగా దూసుకు పోతుంటే మరో వైపు అల్లు శిరీష్ మాత్రం కనీసం సక్సెస్ లేకుండా ఢీలా పడిపోతున్నాడు. ఈయన చేస్తున్న సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. ఈమద్య వచ్చిన ‘ఏబీసీడీ’ చిత్రం కూడా దారుణంగా పరాజయం పాలయ్యింది. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా అల్లు శిరీష్ నిరాశ పడకుండా మరో రీమేక్ చేయాలని ఉబలాట పడుతున్నాడు. అల్లు అరవింద్ ప్రస్తుతం ఒక రీమేక్ విషయంలో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఇటీవలే ‘రాక్షసుడు’ చిత్రంతో సక్సెస్ దక్కించుకున్న దర్శకుడు రమేష్ వర్మతో అల్లు అరవింద్ చర్చలు సాగుతున్నాయట. రమేష్ వర్మ వద్ద ఒక మంచి రీమేక్ స్టోరీ ఉంది. ఆ సినిమా చేస్తే అల్లు శిరీష్‌కు మంచి పేరు వస్తుందని అలాగే మంచి హిట్ కూడా వస్తుందని అల్లు అరవింద్ భావిస్తున్నాడు. అందుకే శిరీష్ తర్వాత సినిమా బాధ్యతను రమేష్ వర్మకు అప్పగించినట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే అల్లు శిరీష్ చాలా సినిమాలే చేశాడు. మరి ఈ చిత్రంతో అయినా సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.