Site icon TeluguMirchi.com

శ్రియాతో తన సంబంధం గురించి క్లారిటీ ఇచ్చిన శిరీష్‌

మెగా హీరో అల్లు శిరీష్‌ ప్రస్తుతం తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రంతో మంచి సక్సెస్‌ను సొంతం చేసుకున్న శిరీష్‌ తదుపరి చిత్రాన్ని కూడా హిట్‌ అయ్యే విధంగా ప్లాన్‌ చేసుకుంటున్నాడు. శిరీష్‌ తదుపరి చిత్రాన్ని వి ఐ ఆనంద్‌ దర్శకత్వంలో నటించనున్నాడు. మోహన్‌లాల్‌ చిత్రంలో కీలక పాత్ర పోషించి మళయాలంలోకి ఎంట్రీ ఇచ్చిన శిరీష్‌కు పెద్దగా ఫలితం లేకున్నా కూడా తదుపరి చిత్రంపై బాగా శ్రద్ద వహిస్తున్నాడు. ఇంకా సినిమా మొదలు కాలేదు కాబట్టి శిరీష్‌ హాయిగా ఎంజాయ్‌ చేస్తున్నాడు. పార్టీ మూడ్‌లో శిరీష్‌ ఎంజాయ్‌ చేసిన ఫొటోలు కొన్ని లీకయ్యాయి. ఆ ఫొటోలలో కేవలం శిరీష్‌ మాత్రమే కాకుండా అఖిల్‌ మాజీ లవర్‌ శ్రియా భూపాల్‌ కూడా ఉంది. దాంతో ప్రేక్షకులకు ఈ ఫొటోపై నానా రకాలుగా అనుమానాలు వచ్చాయి.

ఫొటోలు లీకయినప్పటి నుండి శ్రియా, శిరీష్‌ల మధ్య సంబంధం ఏంటి అనేది సందేహంగా మారింది. దాంతో శిరీష్‌ వెంటనే క్లారిటీ ఇచ్చాడు. చెడు వార్తలు శృతి మించకముందే క్లారిటీ ఇస్తే మంచిది అనుకుని శ్రియాతో తన సంబంధం గురించి క్లారిటీ ఇచ్చాడు. వీకెండ్‌ తన స్నేహితుడు శ్రీకాంత్‌ రెడ్డి, శ్రియా భూపాల్‌తో ఎంజాయ్‌ చేశాను అని పోస్ట్‌ చేశాడు. అంతేకాకుండా శ్రియా భూపాల్‌ తన బేబీ సిస్టర్‌ అని ఒక ఫొటోను పోస్ట్‌ చేశాడు. శిరీష్‌ శ్రియాను సిస్టర్‌ అనడంతో అంతా ఎదురు చూస్తున్న ప్రశ్నలన్నిటికి క్లారిటీ వచ్చేసింది.

Exit mobile version