Site icon TeluguMirchi.com

తమ్ముళ్లలా హీరో అవ్వాలనుకుంటున్న బాబీ

అల్లు అరవింద్‌ పెద్ద కొడుకు బాబీ చాలా తక్కువగా మీడియాలో ఉంటాడు. ఆయన వ్యాపారాలతో బిజీగా ఉంటూ ఉంటాడు. నిర్మాణంపై కూడా పెద్దగా ఆసక్తి చూపించని బాబీ ఇన్నాళ్లు ఇతరత్ర విషయాల్లో ఆసక్తిగా ఉండేవాడు. ఇటీవలే రెండవ వివాహం చేసుకోవడం ద్వారా మీడియాలో పతాక శీర్షికన నిలిచిన బాబీ తాజాగా మరోసారి మీడియాలో ప్రముఖంగా నిలిచాడు. ఈయన తాజాగా తన సినీ రంగ ప్రవేశం గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

మెగా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అల్లు బాబీ వెండి తెరపై కనిపించాలని ఆశ పడుతున్నాడు. మొదట క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పరిచయం అయ్యి, ఆ తర్వాత వీలైతే హీరోగా కూడా సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. అదే సమయంలో గీతా ఆర్ట్స్‌ను ఫుల్‌గా స్వాదీనం చేసుకుని వరుసగా సినిమాలు నిర్మించాలని భావిస్తున్నాడు. చిన్నా పెద్ద సినిమాలను వరుసగా నిర్మించాలని భావిస్తున్నాడు. అందుకోసం ప్రణాళికలు సిద్దం చేస్తున్నాడు. బాబీకి నటన అంటే ఆసక్తి ఉన్నప్పటికి ఆయన శరీర సౌష్టవం కారణంగా హీరోగా ప్రయత్నించలేదు.

Exit mobile version