Site icon TeluguMirchi.com

‘బేబీ’ రషెస్ చూశాను.. ఇది కల్ట్ సినిమా : మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్


ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే బేబీ సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. టీజర్, ట్రైలర్‌లో సాయి రాజేష్ రాసిన డైలాగ్స్ అందరినీ కదిలిస్తున్నాయి. ఈ మూవీ జూలై 14న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు అల్లు అరవింద్, డైరెక్టర్ మారుతి, బింబిసార దర్శకుడు వశిష్ట, రాహుల్ సంకృత్యాన్, బన్నీ వాసు, మెహర్ రమేష్, బీవీఎస్ రవి, బుచ్చిబాబు సానా, కార్తీక్ వర్మ దండు, బలగం వేణు, వీఐ ఆనంద్, సంపూర్ణేశ్ బాబులు ముఖ్య అతిథులుగా వచ్చారు. అల్లు అరవింద్ బిగ్ టికెట్‌ను రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘కొంత కాలం క్రితం బేబీ రషెస్ చూశాను. ఇది కల్ట్ సినిమా. రాజేష్ ఆకారం చూస్తే కల్ట్ అనిపించదు. కానీ బుర్రంతా కల్ట్. ఆయన హార్ట్‌ను ఎంత మంది బ్రేక్ చేశారో తెలియడం లేదు. సాయి రాజేష్‌ ఓ మంచి ప్రేమికుడు. కాకినాడలో ఎక్కడో చిన్న మ్యూజిక్ ప్లే చేసుకునేవాడు.. గీతా ఆర్ట్స్‌లో పని చేయించుకోవాలనేలా చేశాడు. టాలెంట్ ఉంటే ఏదైనా చేయొచ్చు అని నిరూపించాడు. విజయ్ అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చాడు. వైష్ణవిది రియల్ ఎమోషన్. అలాంటి ఎమోషన్లు ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయి. ఆనంద్ గురించి విజయ్‌కి ఫోన్ చేశాను. రష్ చూశాను.. మీ తమ్ముడు ఏంటి చించేశాడు? అని అన్నాను. కొన్ని సీన్లలో ఆయన నటన చూస్తే మన కంట్లోంచి నీరు వస్తుంది. త్రీ రోజెస్ చూసినప్పుడే బాల్ రెడ్డి గురించి అడిగాను. బాల్ రెడ్డి మట్టిలో మాణిక్యం లాంటివాడు. చాక్లెట్ బాయ్ విరాజ్ అశ్విన్‌ కూడా అద్భుతంగా చేశాడు. ధీరజ్‌ త్వరగా పైకి వస్తాడు. బేబీ దర్శక నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Exit mobile version