Site icon TeluguMirchi.com

వైరల్ గా మారిన బన్నీ వైఫ్ ఫోటో షూట్

సౌత్ ఇండియన్ హీరోల సతీమణులందరిలోకెల్లా అల్లు స్నేహారెడ్డికే సోషల్ మీడియా లో విపరీతమైన ఫాలోవర్లున్నారు. ఆమెను నెట్టింట్లో ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు. అలా ఆమె అరుదైన రికార్డులను నెలకొల్పింది. ఇకప్పటికీ నమ్రత, ఉపాసన వంటి వారికంటే ఎక్కువ మంది అభిమాన గణంతో ముందు వరుసలో నిల్చుంది. బన్నీకి సంబంధించిన అప్డేట్లు, పిల్లలు అర్హ, అయాన్‌ల అల్లరికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది.

అందుకే బన్నీ ఫ్యాన్స్ కూడా స్నేహారెడ్డిని ఎక్కువ ఫాలో అవుతుంటారు. టాప్ హీరోయిన్ సమంత డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్.. స్నేహారెడ్డికి సైతం పని చేస్తుంటాడు. అతను డిజైన్ చేసిన దుస్తుల్లో స్నేహారెడ్డి అదరగొట్టింది. ఆమెను చూసిన వారంతా కూడా నోరెళ్లబెట్టేస్తున్నారు. స్టార్ హీరోయిన్ కూడా ఆమె ముందు దిగదుడుపే అంటున్నారు. ఇక ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Exit mobile version