ఎట్టకేలకు షూటింగ్ మొదలు పెట్టుకున్న త్రివిక్రమ్-బన్నీ చిత్రం

Trivikram-bunny-filmస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుండి ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ మొదలు పెట్టారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన సమంత, ఆదా శర్మ హీరోయిన్లుగా ఎంపికయ్యారు. ఏప్రిల్‌ 10న ఈచిత్రం లాంఛనంగా ప్రారంభం అయిన విషయం విధితమే. అంతేకాదు గతానికి భిన్నంగా దీనిని తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల చేయనున్నారు. కానీ ఇందులో ఒక ప్రత్యేక పాత్ర ఉండటంతో ఎవరిని ఎంపిక చేయాలనే విషయం చర్చకు వచ్చినప్పుడు త్రివిక్రమ్‌ స్నేహను తీసుకుంటే బాగుంటుందని చెప్పడంతో వెంటనే ఆ దిశగా స్నేహతో సంప్రదింపులు జరపడంతో వెంటనే ఓకే చెప్పిందట. దీనితో ఈ చిత్రంలో స్నేహ ఒక ప్రత్యేక పాత్రలో నటించబోతోంది.