చలికి వణుకుతున్న బన్నీ


అల్లు అర్జున్ లేటెస్ట్ చిత్ర ‘నా పేరు సూర్య’. నా ఇల్లు ఇండియా. రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా ఈ సినిమాతో వెండి తెరకు పరిచయం కానున్నాడు.

తాజాగా ఈ చిత్ర షూటింగ్‌ దేశ సరిహద్దుల్లో జరుగుతోందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. మైనస్‌ 12 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో షూటింగ్‌ అంటే టఫ్ టాస్కె.

ఇక తెలుగు, మ‌ల‌యాళం, హిందీ భాషల‌లో ఈ సినిమాని విడుద‌ల చేయాల‌ని ముందుగానే భావించిన‌ప్ప‌టికి, రీసెంట్‌గా తమిళం.. మరాఠి.. బెంగాలీ.. భోజ్ పురి భాషల్లోనూ ‘నా పేరు సూర్య’ను రిలీజ్ చేయాల‌ని సన్నాహాలు చేస్తున్నారు. వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.