బన్నీ ప్యాకప్ చెప్పశాడు

allu arjun
అల్లు అర్జున్ ‘రుద్రమదేవి’ చిత్రం షూటింగును పూర్తి చేశాడు. ఈ సినిమాకి తను బల్క్ డేట్స్ ఇవ్వడంతో అతని షూటింగ్ పార్టుని ఏకబిగిన కంప్లీట్ చేశారు. హైదరాబాదు శివారులో వేసిన భారీ సెట్స్ లో ఈ షూట్ నిర్వహించారు. ఇందులో బన్నీ గోన గన్నారెడ్డిగా పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకుడు. డిసెంబర్ లో చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నహాలు జరుగుతున్నాయి. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.