ఇది ‘పుష్ప గాడి రూలు’.. తగ్గేదేలే


పాన్ ఇండియా స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్. పుష్ప ది రైజ్ సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప 2 కాన్సెప్టు టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ టీజర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇక ఈ వీడియోలో పుష్పను పోలీసులు కాల్చేశారని, ఎనిమిది బుల్లెట్లు దిగాయని, పోలీసులు ఎంత వెతికినా దొరక్కపోవడంతో పుష్ప మరణించాడని అంతా అనుకుంటూ ఉండటం, పుష్ప చేసే మంచి పనుల వల్ల జనాలంతా కూడా అతడ్ని దేవుడిలా చూస్తుంటారని ఇందులో చూపించేశాడు సుకుమార్. ఇక పుష్ప బతికే ఉన్నాడా? లేదా? అనే అనుమానంతో జనాలు ఉండగా.. పులుల జాడ కనుక్కునేందుకు పెట్టిన సీసీటీవీ కెమెరాల్లో అల్లు అర్జున్ స్టైలిష్ రాక కనిపించింది. పుష్పను చూసిన తరువాత పులి కూడా తప్పుకుంటుంది. అనంతరం “అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వెళ్లాయంటే.. పులి వచ్చిందని అర్థం.. అదే పులి రెండు అడుగులు వెనక్కి వెళ్లిందంటే.. పుష్ప వచ్చాడని అర్ధం” అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ అదిరిపోయిందంతే. ఇక చివర్లో ఇది పుష్ప గాడి రూలు అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ తో వీడియో ముగుస్తుంది.