పుష్ప సినిమా ప్రచారంలో భాగంగా, ప్రముఖ నటుడు అల్లు అర్జున్ డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రత్యేకంగా తన X ఖాతా (మునుపటి ట్విట్టర్)లో ఒక షార్ట్ విడియోను షేర్ చేశారు. ఈ సందేశంలో, డ్రగ్స్ వ్యతిరేక ప్రచారానికి పిలుపునిచ్చిన అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వ యాంటి నార్కోటిక్ టీం ప్రయత్నాలను అభినందించారు.
ఆ వీడియోలో, ఆయన ప్రజలను డ్రగ్స్ వినియోగం పట్ల అప్రమత్తం కావాలని కోరుతూ, ఎవరైనా ఇలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటే, టోల్-ఫ్రీ నెంబర్ 1908 కు కాల్ చేసి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ సమస్యను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రోత్సాహం తెలుపుతూ, సమాజం యొక్క సహకారం అవసరం అని కూడా అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఈ ప్రత్యేక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Let’s unite to support the victims and work towards building a safer, healthier society.
Humbled to join this impactful initiative by the Government of Telangana.@revanth_anumula @TelanganaCMO @TG_ANB @TelanganaCOPs pic.twitter.com/tZ5Rkiw5Lg
— Allu Arjun (@alluarjun) November 28, 2024