Site icon TeluguMirchi.com

అల్లు అర్జున్ లవర్ .. పైటర్ కూడా

తన లవర్ ఫైటర్ కూడా అంటున్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్‌ లేటెస్ట్ చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. బన్ని ఇందులో ఆర్మీ అధికారిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రంలోని దేశభక్తి నేపథ్యంలో సాగే తొలి పాటను విడుదల చేశారు.

కాగా..ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండో పాటను విడుదల చేయబోతున్నారు. ‘లవర్‌ ఆల్సో ఫైటర్‌ ఆల్సో’ అంటూ ప్రేమ నేపథ్యంలో ఈ పాటను రూపొందించారు. దీనిపై అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ. ‘ ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలోని రెండో పాట ఫిబ్రవరి 14న విడుదల కాబోతోంది. ఈ పాట వినగానే నచ్చేసింది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అన్నాడు బన్నీ.

Exit mobile version