ఇప్పటికే కోల్గెట్ టూత్ పేస్ట్‌కు, సెవన్ అప్ కూల్‌డ్రింక్ తరపున ప్రచారం చేసిన అల్లు అర్జున్… ప్రస్తుతం జోయాలుకాస్ సంస్థ తరపున ప్రచారం చేయడానికి రంగంలోకి దిగాడు. ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో యాడ్ చిత్రీకరణ కూడా జరిగింది. తాజాగా అందుకు సంబంధించిన యాడ్ పోస్టర్లు వివిధ ప్రాంతాల్లో దర్శనం ఇవ్వడంతో పాటు….. వీడియో యాడ్ కూడా ప్రచారంలోకి వచ్చింది. ” స్వచ్ఛత కోసం మీరు ఎదురు చూసినప్పుడు … నమ్మకం కోసం మీరు అన్వేషించినప్పుడు … అందాన్ని మీరు ఇష్టపడుతున్నప్పుడు … సరైన విలువను … సరైన ధరను మీరు కోరుకున్నప్పుడు మీ మనసు చెబుతుంది!”. అంటూ బన్నీ తనదైన స్టైల్లో ప్రచారాన్ని నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇదంతా చూస్తుంటే బన్నీ కూడా యాడ్ ఫిల్మ్ రంగంలో తన సత్తాచాటేందుకు సిద్ధం అవుతున్నారని స్పష్టం అవుతుంది. ఇక బన్నీ దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఇద్దరమ్మాయిలు చిత్రం షూటింగ్ లో బిజీగా వున్నాడు. నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.