స్టార్ హీరోలు ఒకప్పుడు కేవలం నటనపైనే దృష్టి పెట్టే వారు. కాని ఇప్పుడు స్టార్స్ నటనతో పాటు బిజినెస్‌పై కూడా దృష్టి పెడుతున్నారు. ఎక్కువ శాతం మంది హీరోలు నిర్మాతలుగా మారుతున్నారు. తమ సినిమాలను తామే నిర్మించుకోవడం లేదంటే, చిన్న చిత్రాల నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వడం వంటివి చేస్తున్నారు. ఇదే సమయంలో వేరు వేరు బిజినెస్‌లు కూడా చేస్తున్నారు. విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ పేరుతో తన కొత్త బిజినెస్‌ను ప్రారంభించాడు.
విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్‌కు మంచి పేరు వచ్చింది. దాంతో రౌడీ వేర్‌కు యూత్‌లో మంచి క్రేజ్ దక్కింది. తాజాగా మహేష్‌బాబు కూడా హంబుల్ అంటూ ఒక కొత్త సొంత బ్రాండ్‌ను తీసుకు రాబోతున్నాడు. అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహేష్‌బాబు లైన్‌లో ఉండగానే అల్లు అర్జున్ కూడా సొంత బ్రాండ్‌ను స్టార్ పేరుతో తీసుకు వచ్చే ఉద్దేశ్యంలో ఉన్నట్లుగా ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ విషయమై బన్నీ స్వయంగా ప్రకటించబోతున్నాడు. మరీ ఆలస్యం కాకుండా వచ్చే నెలలోనే బన్నీ సొంత బ్రాండ్ స్టార్‌ను షురూ చేయబోతున్నాడు.