ప్రస్తుతం స్క్రిప్ట్ పనులను మెరుగులు దిద్దే పనిలో హరీష్ ఉన్నాడు. అక్టోబర్లో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురావాలని చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం తో హిట్రిక్ కొట్టాలనే కసితో బన్నీ ఉన్నాడు. దిల్ రాజు కు సైతం బన్నీ తో మూడో చిత్రం కావడం తో ఆయనకూడా తన బ్యానర్ లో బన్నీ తో హిట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. గతం లో వీరి కాంబినేషన్ లో ఆర్య , పరుగు సినిమాలు వచ్చి సూపర్ సక్సెస్ సాధించాయి. హరీష్ శంకర్ సైతం ఓ మెగా హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. మొత్తానికి ఈ ముగ్గురికి ఈ చిత్రం ప్రధానమయిందే అని చెప్పాలి. ఇక సినిమాకు సంబంధించిన కాస్ట్, క్రూ త్వరలోనే తెలుస్తుంది.