మళ్లీ రేసు మొదలుపెట్టబోతున్న అల్లు అర్జున్ ..

allu-arjun-new-movie-dateరేసుగుర్రం , సరైనోడు చిత్రాలతో ఫుల్ రేసు మీదున్న అల్లు అర్జున్ , తన కొత్త సినిమాను పట్టాలెక్కించడానికి రెడీ అయ్యాడు. గబ్బర్ సింగ్ ఫేం హరీష్ శంకర్ దర్శకత్వం లో ఓ యాక్షన్ చిత్రాన్ని చేయడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఫై తెరకెక్కించబోతున్నాడు.

ప్రస్తుతం స్క్రిప్ట్ పనులను మెరుగులు దిద్దే పనిలో హరీష్ ఉన్నాడు. అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురావాలని చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం తో హిట్రిక్ కొట్టాలనే కసితో బన్నీ ఉన్నాడు. దిల్ రాజు కు సైతం బన్నీ తో మూడో చిత్రం కావడం తో ఆయనకూడా తన బ్యానర్ లో బన్నీ తో హిట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. గతం లో వీరి కాంబినేషన్ లో ఆర్య , పరుగు సినిమాలు వచ్చి సూపర్ సక్సెస్ సాధించాయి. హరీష్ శంకర్ సైతం ఓ మెగా హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. మొత్తానికి ఈ ముగ్గురికి ఈ చిత్రం ప్రధానమయిందే అని చెప్పాలి. ఇక సినిమాకు సంబంధించిన కాస్ట్, క్రూ త్వరలోనే తెలుస్తుంది.