తాజాగా శర్వానంద్ ‘రణరంగం’ చిత్రంలో నటించాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంను ఆగస్టు 15వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకను ఆగస్టు 4వ తారీకున కాకినాడలో నిర్వహించబోతున్నారు. అందుకోసం అల్లు అర్జున్ కాకినాడ వెళ్లబోతున్నాడు. అల్లు అర్జున్ ఇప్పటికే ఈ వేడుకలో పాల్గొనేందుకు ఓకే చెప్పాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో చిత్రంతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఆ తర్వాత సుకుమార్ మరియు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో కూడా నటించబోతున్నాడు.