Allu Arjun : మరో సారి గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్..


Icon Star Allu Arjun : కేరళ లోని వయనాడ్ లో ఇటీవల ప్రకృతి సృష్టించిన విషాధం అంతా ఇంతా కాదు. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడి రాత్రికి రాత్రే పలు గ్రామాలు నేలమట్టం అయ్యాయి. ఎన్నో ప్రాణాలు నిద్దుర లోనే కన్ను మూసాయి. దాదాపు 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందల మంది గాయపడ్డారు. మరికొందరు గల్లంతయ్యారు. ఇప్పటికీ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో వరద బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ జాబితాలో చేరారు.

Also Read : పుష్ప 2 క్లైమాక్స్ గూస్ బంప్స్ అంతే..!

అల్లు అర్జున్ తన వంతు సాయంగా 25 లక్షల రూపాయలని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు అల్లు అర్జున్ ఒక ట్వీట్ చేసారు. కేరళ రాష్ట్రం లో నెలకొన్న పరిస్థితి తనని బాధించిందని, అక్కడి ప్రజలు అతన్ని ఎంతగానో ప్రేమించారని చెప్తూనే తన వంతు సాయంగా 25 లక్షల రూపాయలని విరాళంగా ప్రకటిస్తున్నట్టు ఆయన తెలిపారు.

Also Read : ‘దేవర’ సెకండ్ సింగిల్ రిలీజ్.. ఎన్టీఆర్, జాన్వీల రొమాన్స్ నెక్స్ట్ లెవెల్..

తెలుగు రాష్ట్రాల తర్వాత, కేరళ లో యెనలేని అభిమానాన్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్, అక్కడ అందరికీ మల్లు అర్జున్ గా సుపరిచితం. అల్లు అర్జున్ ఇటువంటి సహాయక కార్యక్రమాల్లో ఎప్పుడూ చురుగ్గా పాల్గొంటారు. ఇక సినిమాల విషయానికొస్తే, అల్లు అర్జున్ ప్రస్తుతానికి పుష్ప పార్ట్ 2 చిత్రీకరణ లో బిజీ గా ఉన్నారు.

Also Read : డబుల్ ఎనర్జీతో ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్.. ఇక మాస్ జాతరే !