Site icon TeluguMirchi.com

జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. 69 ఏళ్ళ రికార్డు బ్రేక్ !


భారతీయ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. 2021 వ సంవత్సరానికి గాను, న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో జరిగిన 69వ నేషనల్‌ ఫిల్మ్స్‌ అవార్డుల్లో జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ‘పుష్ప’ మూవీకి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ సొంతం చేసుకున్నారు. దీంతో 69 ఏళ్ల సినిమా ఇండస్ట్రీ చరిత్రలో జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్న మొట్ట మొదటి తెలుగు నటుడిగా బన్నీ చరిత్ర సృష్టించాడు.

ఇక ఈ విషయం తెలియడంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. పుష్ప సినిమా నిర్మాతలతో పాటు, డైరెక్టర్ సుకుమార్ బన్నీ ని కలిసి విషెస్ తెలిపారు. ఆ సమయంలో బన్నీ, సుకుమార్ ఒకరినొకరు హత్తుకుని భావోద్వేగానికి గురైయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. ఇకపోతే ఉత్తమ నటుడి కేటగిరీలో ఈసారి టాలీవుడ్ నుంచి ఏకంగా ముగ్గురు నటులు.. ‘పుష్ఫ: ది రైజ్’ సినిమాకు అల్లు అర్జున్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు గాను జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ రేసులో ఉండగా.. అల్లు అర్జున్ విజేతగా నిలిచారు.

Exit mobile version