2020లో ఏప్రిల్ 10 గుడ్ ఫ్రైడే రోజు కపిల్ దేవ్ బయోపిక్ చిత్రం 83 అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. 1983 వరల్డ్‌కప్ ఫైనల్లో అప్పటి డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ టీమ్ సక్సెస్ స్టోరీ ఆధారంగా మూవీ తెరకెక్కనుంది.
అయితే ఈ సినిమాలో మన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇందులో కపిల్ దేవ్ పాత్రని రణవీర్ సింగ్ పోషిస్తుండగా, ఇండియన్ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో బన్నీ నటిస్తాడని ప్రచారం జరుగుతుంది. అయితే బన్నీ పాత్ర గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎందుకంటే బన్నీ అంత తేలిగ్గా బాలీవుడ్ సినిమాలకు ఒప్పుకోరు.
హిందీ, తెలుగుతో పాటు పలు భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్‌కి కోచ్ గా నటించనున్నారు. చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్.. బన్నీ పాత్రని చాలా స్టైలిష్‌గా డిజైన్ చేయడంతో శ్రీకాంత్ పాత్రకు బన్నీ ఒప్పుకున్నారో? లేదో? తెలియాలంటే ఆయన స్పందించేవరకు వేచి చూడాల్సిందే. అయితే బన్నీకి బాలీవుడ్ ప్రముఖులతో మంచి స్నేహం ఉంది.
తెలుగు, మలయాళ భాషలలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బన్నీకి తమిళంలోను ఆదరణ బాగానే ఉంది. ఇక బన్నీ టార్గెట్ బాలీవుడ్ అని చెబుతుండగా, త్వరలోనే అది జరగనుందని ఫిలింనగర్లో చర్చించుకుంటున్నారు.