అల్లు వారి వారసుడిగా తెలుగు తెరకు గంగోత్రి చిత్రం ద్వారా పరిచయం అయ్యి, ఒ పక్క అల్లు రామలింగయ్య మనవడుగా, మరోపక్క మెగాస్టార్ చిరంజీవి గారి మేనల్లుడిగా పరిచయం అయిన అల్లు అర్జున్, గట్టి పోటిని తట్టుకుని, తన టాలెంట్ తో తన స్టామినా ఏంటో నిరూపించాడు. క్లాసైనా, మాసైనా, యూత్‌పుల్ ఎంటర్టైనర్ అయినా, ఫ్యామిలి ఎంటర్టైనర్ అయినా, ఎక్సపర్మెంట్ అయినా, మల్టిస్టారర్ అయినా ఏ పాత్రైనా ఓదిగి నటించే లా తనని తాను మలుచుకున్నాడు. స్టైలిష్‌స్టార్ గా తన కెరిర్ ని స్టార్ట్ చేసి 15 సంవత్సరాలు పూర్తిచేసుకున్నాడు.
తన వెనుక సిని కుటుంబం వున్నా కూడా ఎనాడు సిని హీరో అవ్వాలని కలలు కనలేదు. తన మనసంతా కంప్యూటర్ గ్రాఫిక్స్ , యానిమేషన్స్ బొమ్మలపైనే వుండేది. అయితే పుట్టుకతో పుణికి పుచ్చుకున్న కొన్ని లక్షణాలు బన్ని ని సినిమా రంగం వైపుకి తీసుకువచ్చాయి. బన్నిలో వుండే చలాకి తనం, చురుకుదనం చిన్నప్పటి నుండే చిరంజివి పాటలకి స్టెప్స్ వేస్తూ అందర్ని అకట్టుకున్నాడు. డాడి చిత్రం లో మెరుపులా మెరిసి తనది స్ప్రింగ్ బాడి అని యాక్టింగ్ లో తన ఈజ్ ఎంటో చెప్పకనే చెప్పేసాడు. అంతే అల్లు వారి వారసుడికి నటుడుగా తెరంగేట్రానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. ముంబాయ్ లో కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ పోందాడు. అయితే తన పెద్దల నుండి ఏకలవ్య శిష్యుడిగా తను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే వున్నాడు. శతాధిక దర్శకుడు కె.రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా గంగోత్రి చిత్రం తో పరిచయం అయ్యాడు.
గంగోత్రి చిత్రం తో తెలుగు తెరకు పరియం అయినా కూడా స్టైలిష్‌స్టార్ గా ఆర్య చిత్రం తో క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఫీల్ మై లవ్ అంటూ అందరి మనసులు దోచుకున్నాడు. అక్కడ నుండి బన్ని ఏ రోజు వెనక్కి చూసుకొలేదు. తనని తాను ఓ శిల్పి లా మార్చుకుంటూ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఎలా ఎంటర్టైన్ చెయ్యాలో అనే తన ఆలోచనలోనే వుండిపోయాడు. ఎప్పటికి ఒక చిత్రం తాలుక ఆనవాళ్ళు మరో చిత్రం లో కనిపించకుండా పాత్రలు మాత్రేమే కనిపించేలా తన హెయిర్ స్టైల్ నుండి డ్రస్సింగ్ స్ట్రైల్ వరకూ ప్రతి చిన్న విషయాన్నికేర్, డెడికేషన్ తో తను చేసుకుంటూ వచ్చాడు. తనకి సోషల్ మీడియాలో నెం 1 గా ఫాలోవర్స్ రావటానికి ముఖ్యకారణం బన్ని స్టైల్ , లుక్ అని ప్రత్యేఖంగా చెప్పనక్కర్లేదు. కేవలం తెలుగు రాష్ట్రల్లోనే కాకుండా అటు మళయాల ఇండస్ట్రిలో , కన్నడ లో సరికొత్త ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. దాదాపు 15 సవత్సరాలలో 18 చిత్రాలు చేసి ఎక్కువ సక్సస్ రేట్ వున్నా హీరోగా మరో మంచి రికార్డ్ వుంది.
ప్రస్తుతం స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకుడిగా తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన, ఫస్ట్ ఇంపాక్ట్, పోస్టర్ ఇంపాక్ట్ కి, సాంగ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇవన్ని చూసినవారంతా అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కి, లుక్ కి ఫిదా అయ్యారు. ఇక అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా వైజాగ్ ఆర్ కె బీచ్ లో 5 ఫీట్ ఎత్తు లో… 30 ఫీట్లలో వేసిన సైకత శిల్పం చూపరుల్ని విశేషం గా ఆకట్టుకుంది. రాష్ట్రపతి అవార్డ్ గ్రహీత సైకత శిల్పి మానస్ శేషు ఆధ్వర్యంలో ఈ సాండ్ ఆర్ట్ వేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు సైకత శిల్పాన్ని చూసి పండగ చేసుకుంటారు. అల్లు అర్జున్ కి అభిమానులు ఇస్తున్న అందమైన కానుక అని సైకత శిల్పి అన్నారు. ఈ సందర్భంగా రేపు అనగా 8న డైలాగ్ ఇంపాక్ట్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. అతి త్వరలో సాంగ్స్, ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చేస్తారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసి… ప్రపంచవ్యాప్తంగా మే 4న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ – శేఖర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు.
ఇలా అల్లు అర్జున్ తన తెలుగు సినిమా ఇండస్ట్రిలో 15 సవత్సరాలు పూర్తిచేసుకొవటమే కాకుండా రేపు ఏప్రిల్ 8న తన పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్బంగా హ్యపి బర్త్‌డే టు అల్లు అర్జున్.