Site icon TeluguMirchi.com

ఇక, మల్లు అర్జున్..!

allu arjun

మాలీవుడ్ లో మాంఛీ మార్కెట్ వున్న టాలీవుడ్ హీరో అల్లు అర్జున్. బన్నీ అన్నీ సినిమాలకు మాలీవుడ్ లో మంచి వసూళ్లు దక్కాయి. తాజా చిత్రం ‘రేసుగుర్రం’ కూడా కేరళలో బాగానే పరిగెత్తింది. భారీ వసూళ్లను సొంతం చేసుకొంది. మాలీవుడ్ లో బన్నీ స్ట్రెయిట్ మూవీ చేయబోతున్నట్లు తాజా సమాచారమ్. మాలీవుడ్ కు చెందిన ఓ అగ్రనిర్మాత ఇందుకు ప్రయత్నాలు మొదలెట్టాడట. పక్కా స్కిప్ట్ రెడీ కావడమే తరువాయి. కేరళలో బన్నీ అభిమానులు ఆయన్ను మల్లు అర్జున్ గా పిలుచుకుంటారు. ఇకపై మనం కూడా మ(అ)ల్లు అర్జున్ పిలవాలేమో.. ! మల్లు అర్జున్ మళయాల మూవీ పూర్తి డిటేల్డ్ గా తెలియాలంటే.. మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Exit mobile version