గత ఏడాది వచ్చిన ‘నా పేరు సూర్య’ చిత్రం తర్వాత అల్లు అర్జున్ ఇప్పటి వరకు మరో సినిమాను చేసింది లేదు. దాంతో ఆ గ్యాప్‌ను ఫిల్ చేసే ఉద్దేశ్యంతో ఒకే సారి మూడు సినిమాలను లైన్లోకి తీసుకున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతుంది. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఆ తర్వాత సుకుమార్ మరియు వేణు శ్రీరామ్‌ల దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటన వచ్చింది. గత ఏడాది రంగస్థలం చిత్రం విడుదలైనప్పటి నుండి కూడా సుకుమార్ ఎదురు చూస్తున్నాడు. మహేష్‌బాబు చేద్దాం చేద్దాం అంటూ సంవత్సరం వెయిటింగ్లో పెట్టి అనీల్‌కు వెళ్లి పోయాడు.
ఇప్పుడు అల్లు అర్జున్ కూడా చేద్దామని చెప్పి త్రివిక్రమ్ మూవీ సెట్స్‌లో ఉండగానే వేణు శ్రీరామ్ చిత్రాన్ని చేయబోతున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ లో బన్నీ, వేణు శ్రీరామ్ మూవీ పట్టాలెక్కబోతుంది. ఇప్పటికే అంతా రెడీ అయ్యింది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మూవీ ఉంటుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ పూర్తి అయిన తర్వాత అంటే నవంబర్ లేదా డిసెంబర్లో సుకుమార్‌కు డేట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రెండేళ్లు ఖాళీగా ఉన్న సుకుమార్‌కు బన్నీ షాక్ ఇచ్చాడు అంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట సుకుమార్ సినిమా చేయాల్సిందిగా బన్నీని కోరుతున్నారు. కాని బన్నీ మాత్రం త్రివిక్రమ్, వేణు శ్రీరామ్, సుకుమార్ అంటూ ఫిక్స్ అయ్యాడు.