బన్నీకి గాయం !

Allu-Arjun
స్టయిల్ స్టార్ అల్లు అర్జున్ – బోయపాటి కలయికతో తెరకెక్కుతోన్న చిత్రం ’సరైనోడు. సమ్మర్ ముందు సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. బోయపాటి మార్క్ యాక్షన్ తో ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా సరైనోడులో పుష్కలంగా ఉన్నాయట. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ లో బన్నీ భుజానికి గాయమైంది. ఈ విషయం ఆలస్యంగా బయటకొచ్చింది. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినా బన్నీ పట్టించుకోలేదట. ఎప్పటిలాగే వచ్చి షూటింగ్ లో పాల్గొన్నాడు. బన్నీ అంకిత భావానికి చిత్ర బృందం ఆశ్చర్యాన్ని వక్తం చేసింది. అయితే, ఫ్యాన్స్ కంగారు పడాల్సిన పని లేదు. గాయం చిన్నది అని బన్నీ సర్థిచెబుతున్నాడు.

ఇదిలావుండగా.. సరైనోడు సమ్మర్ ముందు సందడి చేయనుంది. బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అల్లు అరవింద్ నిర్మాత.