100% ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘సామజవరగమన’.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్


యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు, వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ‘సామజవరగమన’. అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌ పై ఎకె ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇక శ్రీవిష్ణు సరసన రెబ్బా మోనికా జాన్ నటించారు. జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఫన్ టాస్టిక్ బ్లాక్ బస్టర్ విజయాన్నిఅందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీల నుంచి కూడా ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్, సపోర్ట్ వచ్చింది.

ఇకపోతే తాజాగా అల్లుఅర్జున్ సైతం ఈ చిత్రంపై ప్రశంసలు జల్లు కురిపించారు. “సామజవరగమన చిత్ర యూనిట్ కి నా శుభాకాంక్షలు. చాలా కాలం తర్వాత వచ్చిన అసలైన తెలుగు ఫ్యామిలీ ఎంటర్ టైనర్. మూవీ చివరి వరకు చాలా బాగా ఎంజాయ్ చేశాను. దర్శకుడు రామ్ అబ్బరాజు చాలా బాగా రాసి, చక్కగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. శ్రీవిష్ణు రాకింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. అతడి పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నా. వెన్నెల కిషోర్, నరేష్, నా మలయాళీ రెబ్బా మోనికా జాన్ అలాగే ఇతర నటీనటులు తమ పాత్రలతో ఇచ్చిన సపోర్ట్ చాలా గొప్పది. ఇక సాంకేతిక నిపుణులు, నిర్మాతలందరికీ గౌరవం అంటూ ఇది 100% తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్! ” అని బన్నీ ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు.