చిరు కోసం అంతా రెడీ చేసిన అల్లు అరవింద్‌

మెగాస్టార్‌ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రంతో మంచి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక చాలామంది నిర్మాతలు చిరుతో చేయాలని భావిస్తున్నారు. కానీ చిరు కుటుంబ సభ్యులు ఆ అవకాశం బయటకు పోకుండా చిరు వల్ల వచ్చే లాభాలను వారే పొందాలనుకుంటున్నారు. చిరు ‘ఖైదీ నెం.150’ చిత్రంతో మంచి లాభాలను పొందిన రామ్‌ చరణ్‌ చిరు తదుపరి చిత్రాన్ని కూడా నిర్మించడానికి రెడీ అయ్యాడు. దాంతో ఈ చిత్రం తర్వాత వచ్చే చిత్రాన్ని నిర్మాంచాలని చిరు బావ అల్లు అరవింద్‌ ప్లాన్‌ చేసుకుంటున్నాడు. అందుకు చిరు కూడా ఒకే చెప్పాడు.

చిరు 151వ చిత్ర ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతుండగా 152వ చిత్ర పనులు కూడా షురూ అయ్యాయి. అల్లు అరవింద్‌ నిర్మించనున్న ఈ చిత్రానికి దర్శకుడిగా బోయపాటిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. చిరు సరిపోయే ఓ పవర్‌ఫుల్‌ కథను బోయపాటి సిద్దం చేశాడని, ఈ పాత్రలో చిరు ఇంతవరకు కనిపించలేదు అని, ఇప్పటికే స్క్రిప్టు పనులు కూడా పూర్తవడానికి వస్తున్నాయని, చిరు డేట్స్‌ ఇవ్వగానే మొదలెడుతాం అని అల్లు అరవింద్‌ చెప్పుకొచ్చాడు. అల్లు అరవింద్‌ మాటలు వినడంతో మెగా అభిమానులకు అంచనాలు తారా స్థాయికి చేరుతున్నాయి.