Site icon TeluguMirchi.com

గ్రాండ్ గా అల్లు అయాన్‌ పుట్టిన రోజు వేడుకలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల తనయుడు అల్లు అయాన్‌ 6 వ పుట్టిన రోజు వేడుకలు ఇంట్లోనే గ్రాండ్ గా జరిపారు కుటుంబ సభ్యులు. అల్లు అర్జున్ కు అయాన్‌, అర్హ ఇద్దరు పిల్లలు అనే సంగతి తెలిసిందే. వాళ్లు చేసే అల్లరిని బన్నీ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు షేర్‌ చేస్తుంటారు. పిల్లలపై తన ఇష్టాన్ని పలు సందర్భాల్లో బన్నీ వెల్లడించారు.

తాజాగా అల్లు అయాన్‌ 6వ బర్త్‌డే వేడుకలను ఇంట్లోనే గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా బన్నీ ట్విటర్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. ‘నేను ప్రేమ అంటే ఏమిటని చాలా సార్లు ఆలోచించేవాడిని.. నాకు గతంలో ఎన్నో బలమైన ఫీలింగ్స్‌ కలిగినప్పటికీ.. అది ప్రేమో కాదో తెలియలేదు. కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చినా తర్వాత ప్రేమ అంటో ఏమిటో తెలిసింది. యూ ఆర్‌ ది లవ్‌.. లవ్‌ యూ అయాన్‌. హ్యాపి బర్త్‌ డే మై బేబి’ అని పేర్కొన్నారు.

అయాన్‌ బర్త్‌ డే కేక్‌ కట్‌ చేస్తున్న ఫొటోను బన్నీ భార్య స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘హ్యాపీ బర్త్‌డే.. మై బేబి @6’ అని స్నేహ పేర్కొన్నారు. మరోవైపు ఏప్రిల్‌ 8న బన్నీ బర్త్‌ డే కూడా ఉండటంతో ఈ వీక్‌ అంతా వారి ఇంట సందడే సందడి.

Exit mobile version