Site icon TeluguMirchi.com

ద‌క్షిణాదిన బ‌న్నీనే టాప్‌

allu arjun
యూత్‌లో అల్లు అర్జున్‌కి ఉండే క్రేజే వేరు. స్టైల్‌కి మారుపేరుగా నిలిచిన బ‌న్నీని యువ‌త‌రం అన్ని విధాలా ఫాలో అవుతోంది. అందుకే బ‌న్నీ ఫేస్ బుక్ ఎకౌంట్ తెరిస్తే…. యూత్ క్లిక్కుల మీద క్లిక్కులు కొట్టారు. బ‌న్నీ ఫేస్ బుక్‌లోకి ప్ర‌వేశించిన కొద్ది కాలానికే ఫేస్ బుక్ టీమ్‌.. బ‌న్నీ పేజీని అఫీషియ‌ల్ పేజీగా గుర్తించింది. 10 లక్ష‌లు, పాతిక ల‌క్ష‌లు దాటి ఇప్పుడు ఫేస్ బుక్ లైకులు 50 ల‌క్ష‌ల‌కు చేరింది. ద‌క్షిణాదిన మ‌రే ఇతర హీరోకీ లేన‌న్ని లైకులు బ‌న్నీకి కొట్టారంతా. బ‌న్నీ కూడా ఎప్ప‌టి క‌ప్పుడు త‌న ఫ్యాన్స్ తో ఫేస్ బుక్‌లో ట‌చ్ లో ఉంటున్నాడు. కొత్త సినిమా క‌బుర్లు, లేటెస్ట్ స్టిల్స్ ఫేస్ బుక్‌లో పంచుకొంటున్నాడు. అందుకే… అత‌ని పేజీ లైకులు అలా అలా పెరుగుతున్నాయి. బాలీవుడ్‌లో అమితాబ్‌బ‌చ్చ‌న్ కి కోటి ఫేస్ బుక్ లైకులున్నాయి. బ‌న్నీ త్వ‌ర‌లోనే ఆ మార్కూనీ చేరుకోవాల‌ని ఆశిద్దాం. ఇక సినిమాల విష‌యానికొస్తే రుద్ర‌మ‌దేవిలో గోన‌గ‌న్నారెడ్డిగా క‌నిపించ‌నున్నాడు బ‌న్నీ. ఆ పాత్ర కోసం ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ తీసుకొంటున్నాడు. ఈ సినిమా పూర్త‌య్యాక త్రివిక్ర‌మ్ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది

Exit mobile version