Site icon TeluguMirchi.com

Ugram Trailer : ఉగ్రరూపం చూపించిన అల్లరి నరేష్..


అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘ఉగ్రం’. నాంది సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ ను రిలీజ్‌ చేశారు మేకర్స్. ఇక మూవీ టైటిల్‌కు తగ్గట్లే నరేష్ ఇందులో నిజంగానే తన ఉగ్రరూపం చూపించాడు.

ఈ సినిమాలో అల్లరి నరేష్ శివ కుమార్‌గా మిస్సింగ్ కేసులను టేకప్ చేసి బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చే పోలీసు. అయితే అతని భార్య, కూతురు కూడా కనిపించకుండా పోయారు. ఈ కేసును ఛేదించేందుకు నరేష్ ఎన్నో అవాంతరాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు నరేష్ రెండు డిఫరెంట్ వేరియేషన్స్ లో కనిపిస్తున్నాడు. ఇక ట్రైలర్ లో క్రైమ్ ఎలిమెంట్స్ తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉండటంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. దీనికి తోడు శ్రీచరణ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎఫెక్టివ్‌గా ఉంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ సినిమాలో నరేష్ కి జోడిగా మిర్నా కనిపించనుంది.

Ugram Official Trailer | Allari Naresh | Mirnaa | Vijay Kanakamedala | Sri Charan Pakala

Exit mobile version