Site icon TeluguMirchi.com

లైఫ్ ఆఫ్ పై, ఐరెన్‌ మ్యాన్ కంటే అల్లరి న‌రేష్ సినిమానే బెస్టట‌!

allari-nareshఅల్లరి న‌రేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘యాక్షన్ 3డీ’. విత్ ఎంట‌ర్‌ టైన‌ర్ అనేది ఉప‌శీర్షిక‌. అనిల్ సుంక‌ర ద‌ర్శక‌త్వం వ‌హించారు. ఈ చిత్రంలోని గీతాల్ని ఇటీవల హైద‌రాబాద్‌ లో ప్రదర్శించారు. ఈ సంద‌ర్భంగా న‌రేష్ మాట్లాడుతూ ”ఇలాంటి సినిమాలో న‌టించ‌డం చాలా గ‌ర్వంగా అనిపిస్తోంది. ‘లైఫ్ ఆఫ్ పై’, ‘ఐరెన్ మ్యాన్’ కంటే బెస్ట్ అవుట్ పుట్ ఇస్తాన‌ని ఆ సినిమాల‌కు ప‌నిచేసిన కీత్ చెప్పారు. అనుకొన్నట్టుగానే ఇచ్చారు. అనిల్ సుంక‌ర చాలా ప్యాష‌న్‌ తో పనిచేశారు. బ‌ప్పీల హ‌రి సంగీతం అందించ‌డం చాలా ఆనందంగా ఉంది. స్వాతి ముత్యపు జ‌ల్లుల‌తో పాటంటే నాకెంతో ఇష్టం. దాన్ని ఇప్పుడు రీమిక్స్ చేయ‌డం ఆనందంగా ఉంద‌”న్నారు. ఈనెలాఖ‌రున ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

Exit mobile version