ప్రభాస్ నీ వ‌ద‌ల్లేదు!

allari-naresh-as-prabhshఅల్లరి న‌రేష్‌కి ఓ అల్లరి అల‌వాటుంది. త‌న సినిమాల్లో ఏదో ఓ హీరోని ఇమిటేట్ చేస్తుంటాడు. అత‌ని పాపుల‌ర్ డైలాగుల్ని త‌న‌దైన శైలిలో కామెడీ జోడించి చెబుతుంటాడు. సుడిగాడులో అయితే హీరోలంద‌రినీ కాపీ కొట్టాడు. ప్రభాస్‌ని మాత్రం మ‌ర్చిపోయాడు. ఈసారి కెవ్వుకేక‌లో యంగ్‌ రెబ‌ల్‌స్టార్ డైలాగులు చెప్పి.. ఆలోటు తీర్చుకొన్నాడు. న‌రేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన లేటెస్టు చిత్రం కెవ్వుకేక‌. ఇందులో మిర్చి డైలాగులను న‌రేష్ కాపీ కొట్టాడు. కొన్ని కటౌట్లు చూసి న‌మ్మేయాలి డ్యూడ్ అంటూ అల్లరిగా ప‌లికాడు. ఇంకా ఈ సినిమాలో ఇలాంటి క‌టింగులు చాలా ఉన్నాయ‌ట‌. మ‌రి అవి ఎలా పేల‌తాయో చూడాలి.