జంపు జిలానీగా న‌రేష్‌?

naresh jump jilaniఅల్లరి న‌రేష్ సినిమా పేర్లు వైవిధ్యంగా ఉంటాయి. ఆయ‌న టైటిల్‌తో కూడా న‌వ్వించేస్తారు. ఇప్పుడు న‌రేష్ జంప్ జిలానీ అవ‌తారం ఎత్తబోతున్నారు. న‌రేష్‌-స‌త్తిబాబు క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. య‌ముడికి మొగుడు త‌ర‌వాత వీళ్లిద్దరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కే చిత్రమిదే. ఈ సినిమాకి జంపు జిలానీ అనే పేరు ఖ‌రారు చేశారు. అంబికా కృష్ణ నిర్మాత‌గా వ్యవ‌హ‌రిస్తారు. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన క‌ల‌క‌ల‌ప్పు అనే చిత్రానికి రీమేక్ ఇది. త్వర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉంది.