Site icon TeluguMirchi.com

బందిపోటుగా వ‌స్తున్నాడు

Allari Nareshఅల్లరి న‌రేష్ సినిమాలే కాదు, టైటిళ్లూ న‌వ్విస్తాయి. అరె.. భ‌లే త‌మాషాగా ఉందే అన్నట్టుంటాయి ఆయ‌న సినిమాపేర్లు. ఈసారి మాత్రం కాస్త గంభీర‌మైన పేరు పెట్టారు ఆయ‌న సినిమాకి. అదే బందిపోటు. అష్టాచ‌మ్మాతో ఆక‌ట్టుకొని – అంత‌కు ముందు, ఆ త‌ర‌వాత సినిమాతో మ‌రోసారి త‌న స‌త్తా చాటుకొన్న ఇంద్రగంటి మోహ‌న కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్పటికే న‌రేష్ – ఇంద్రగంటి మ‌ధ్య క‌థా చర్చలు పూర్తయ్యాయ‌ట‌. ఈ సినిమా టైటిల్ గంభీరంగా ఉన్నా, న‌రేష్ శైలిలోనే ఆద్యంతం న‌వ్వించేలా సినిమా తీస్తా అంటున్నారు ఇంద్రగంటి. త్వర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలుస్తాయి.

Exit mobile version