అల్లరి నరేష్ సినిమాలే కాదు, టైటిళ్లూ నవ్విస్తాయి. అరె.. భలే తమాషాగా ఉందే అన్నట్టుంటాయి ఆయన సినిమాపేర్లు. ఈసారి మాత్రం కాస్త గంభీరమైన పేరు పెట్టారు ఆయన సినిమాకి. అదే బందిపోటు. అష్టాచమ్మాతో ఆకట్టుకొని – అంతకు ముందు, ఆ తరవాత సినిమాతో మరోసారి తన సత్తా చాటుకొన్న ఇంద్రగంటి మోహన కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే నరేష్ – ఇంద్రగంటి మధ్య కథా చర్చలు పూర్తయ్యాయట. ఈ సినిమా టైటిల్ గంభీరంగా ఉన్నా, నరేష్ శైలిలోనే ఆద్యంతం నవ్వించేలా సినిమా తీస్తా అంటున్నారు ఇంద్రగంటి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.