Site icon TeluguMirchi.com

Aa Okkati Adakku : ‘ఆ ఒక్కటీ అడక్కు’ టీజర్.. అల్లరోడి అల్లరి మామూలుగా లేదుగా !


అల్లరి నరేష్ హీరోగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ గా వస్తున్న చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన టైటిల్ గ్లింప్స్ అందరిని ఆకట్టుకోగా, మొదటి సింగిల్ ఓ మేడమ్ కూడా మంచి ఆదరణ పొందింది. ఇకపోతే తాజాగా ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు మేకర్స్.

Kiran Abbavaram : ఆ హీరోయిన్ తో కిరణ్ అబ్బవరం ఎంగేజ్మెంట్..

టీజర్ చూస్తుంటే ఈసారి అల్లరి నరేష్ తన మార్క్ ఎంటర్‌టైన్‍మెంట్‍తో అలరించబోతున్నారని తెలుస్తుంది. వయసు అవుతున్న గణ(అల్లరి నరేష్) కు పెళ్లి కాదు. పెళ్లి కోసం అతను పడే తిప్పలు అన్నీ ఇన్నీ కాదు. మొత్తానికి అల్లరి నరేష్ తన అల్లరితో మళ్ళీ అలరించారు. తన కామిక్ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. నరేష్ గర్ల్ ఫ్రెండ్ గా ఫరియా అబ్దుల్లా కూల్ గా కనిపించారు. వెన్నెల కిషోర్, వైవా హర్ష మొదలైన హాస్యనటులు మరింత వినోదాన్ని పంచారు. గోపీ సుందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వినోదాన్ని పెంచింది. నవ్వించే ఈ టీజర్ సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పింది.

Aa Okkati Adakku - Official Teaser | Allari Naresh | Faria | Malli | Gopi Sundar | Rajiv Chilaka

Exit mobile version