Site icon TeluguMirchi.com

రాఘవ రాముని ఆగమనానికి సర్వం సిద్ధం


ఇండియాస్ టాప్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఆదిపురుష్. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిన ఈ మూవీ జూన్ 16 న విడుదల కాబోతోంది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ శ్రీ రామ నవమి నుంచి దేశవ్యాప్తంగా మొదలు కాబోతున్నాయి. ఈ సందర్బంగా దర్శకుడు ఓమ్ రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ మాతా వైష్ణో దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి ఆశిస్సులు అందుకున్నారు.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ శ్రీ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించబోతున్నారు. హనుమంతుడుగా సన్నీ సింగ్ నటించాడు. చెడుపై గెలిచిన మంచిని చూపిస్తూ .. ఆధునిక కాలానికి అన్వయించి రాబోతోన్న ఆదిపురుష్ తో ప్రభాస్ మరో భారీ హిట్ కు శ్రీకారం చుట్టబోతున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఈ నెల 30 నుంచి భారీ స్థాయిలో స్టార్ట్ అవుతున్నాయి.

Exit mobile version