అలియా భట్…. బాలీవుడ్ లో దుమ్ముదులుపుతున్న కుర్ర హీరోయిన్. త్వరలోనే ఈ అమ్మడు తెలుగులోనూ రంగ ప్రవేశం చేయబోతోందని టాక్. ఎవరి పక్కన అనుకొంటున్నారు….?? యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో. ఎన్టీఆర్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. కుమ్మేస్తా, పొగరుబోతు, టెంపర్ అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఆల్రెడీ స్ర్కిప్ట్ రెడీ అయ్యింది. కథానాయికగా కాజల్‌ని కూడా ఫిక్స్ చేశారు. ఇప్పుడు మరో నాయిక పాత్ర కోసం అలియా పేరు పరిశీలిస్తున్నార్ట. పూరి అయితే అలియాతో సంప్రదింపులు కూడా జరిపినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమా అనగానే అలియా భట్ కూడా మరేం ఆలోచించకుండా ఓకే చెప్పేసిందట. అదే నిజమైతే అలియా భట్ కి తెలుగులో గ్రాండ్ ఎంట్రీ లభించినట్టే.