తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 రెండవ కెప్టెన్‌గా అలీ రెజా ఎన్నిక అయ్యాడు. మొదటి కెప్టెన్‌గా వరుణ్ సందేశ్ బాధ్యతలు చేపట్టిన విషయం తెల్సిందే. అయితే వరుణ్ సందేశ్ తన బాధ్యతలను పూర్తిగా విష్మరించాడు. ఇంటి సభ్యులు క్రమశిక్షణతో ఉండటంలో ఆయన శ్రద్ద చూపలేక పోయాడు. అందుకు ఆయన శిక్ష కూడా అనుభవించాడు. ఇక రెండవ కెప్టెన్ కోసం టాస్క్ ఇస్తే శ్రీముఖి కారణంగా అది కాస్త క్యాన్సిల్ అయ్యింది. ఇక ఎట్టకేలకు అలీ కెప్టెన్ అయ్యాడు.
డ్రాగన్స్ మరియు రాజ్యాల టాస్క్‌లో భాగంగా చివరి రౌండ్‌కు అలీ, రవి, రాహుల్‌లు మిగిలారు. సింహాసనంపై చివరి వరకు ఎవరు కూర్చుని ఉంటే వారే ఈ వారం కెప్టెన్ అంటూ బిగ్ బాస్ ప్రకటించడంతో అలీ దానిపై చివరి వరకు కూర్చునే ఉన్నాడు. రాహుల్ సింహాసనంపై నుండి అలీని దించేందుకు ప్రయత్నించలేదు. రవి మాత్రం అలీని దించేందుకు కాస్త కష్టపడ్డాడు. కాని ఒక్క చేయితో ఆ పని సాధ్యం కాలేదు. దాంతో చివరకు అలీ కెప్టెన్ అయ్యాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ అంతా కెప్టెన్సీ టాస్స్ పైనే సాగింది. రాహుల్, శ్రీముఖి మరియు శ్రీముఖి, రోహిణిల మద్య చిన్న చిన్న డిస్కషన్స్ జరిగాయి. అంతకు మించి నేడు సాదా సీదాగానే సాగింది.