అలీని ఇప్పటి వరకు ఎలిమినేషన్స్ పేస్ చేయని కారణంగా ఈ వారం ఎలిమినేషన్స్‌లో ఉంచాలని బాబా భాస్కర్ మరియు వరుణ్‌లతో పాటు ఇతరు నామినేట్ చేయడం జరిగింది. అంతకు మించి ఎవరి వద్ద ఏ కారణం లేదని చెప్పుకొచ్చారు. ఎలిమినేషన్‌కు నామినేట్ అయినా సేవ్ అయ్యి వస్తాడనుకున్న అలీ ఎలిమినేట్ అవ్వడంతో అంతా కన్నీరు మున్నీరు అయ్యారు. ముఖ్యంగా శివ జ్యోతి మరియు శ్రీముఖిలు కన్నీరు పెట్టుకోవడం చూసి ప్రేక్షకుల కళ్లు చెమర్చాయి. నాగార్జున కూడా తన కళ్లలో నీళ్లు తిరిగాయంటూ చెప్పడం అందరిని ఆశ్చర్య పర్చింది. అలీ వెళ్లి పోతే మరీ ఈస్థాయిలో ఎమోషన్స్ వ్యక్తం అవుతాయని ఎవరు ఊహించలేదు. మహేష్ లేదా రాహుల్ ఎలిమినేట్ అవుతారని అంతా అనుకున్నారు. కాని అలీ ఎలిమినేట్ అయ్యాడు.