కమెడియన్ అలీ నటుడిగా ఒకకవైపు కెరియర్‌ను సాగిస్తూనే మరోవైపు పలు కార్యాక్రమాలను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. తాను నిర్వహించే కార్యక్రమాలను రక్తి కట్టించేందుకు అలీ ఏమాత్రం ఆలోచించకుండా తన పక్కన ఉన్న లేడీస్‌పై ఘాటు కామెంట్‌లు చేస్తూ చాలాసార్లు వివాదస్పదం అయ్యాడు. ఇప్పటికే చాలామంది యాంకర్స్, హీరోయిన్స్, సింగర్స్‌పై అలీ ఘాటు కామెంట్‌లు చేశాడు. తాజాగా మరో హాట్ యాంకర్‌పై ఘాటు కామెంట్‌లు విసిరాడు. అలీ మరియు యాంకర్ అనసూయ తాజాగా ప్రముఖ టీవీ ఛానెల్ వారు అందించే అవార్డు వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో తారలకు అవార్డులను అందజేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఒకరికి అవార్డును అందించడానికి హీరో రాజ్‌తరుణ్‌ను పలిచారు. అంతకుముందు ఇద్దరిని పిలిచి అవార్డుల ప్రధానం చేశారు. కానీ రాజ్‌తరుణ్‌ని మాత్రం ఒక్కడిని పిలిచారు. దాంతో ఈ కుర్రహీరో నాకు జత ఎవరు లేరా అంటూ సరదాగా అన్నాడు. ఇక హాట్ యాంకర్ అనసూయ వెళ్లి రాజ్‌తరుణ్ పక్కన నిల్చుని అవార్డుని అందించింది. ఇదే సమయంలో ఊరుకోకుండా నోటి దూలతో అలీ ఎవరు జత కావాలని పిలిచినా అలాగే వెళ్లిపోతావా అంటూ అనసూయపై ఘాటుగా కామెంట్ వేశాడట. దాంతో అనసూయ కాస్త ఇబ్బంది పడి వెంటనే షోని నవ్వుతూ రన్ చేసింది.