గీత దాటిన అలీ

ali
అలీ మంచి వాక్చాతుర్యం క‌ల‌వాడు. భ‌లే బాగా మాట్లాడ‌తాడు. సంద‌ర్భానుసారంగా పంచ్‌లేయ‌డంలో దిట్ట‌. కానీ ఒక‌టే మైన‌స్‌. వేదిక‌పై ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడ‌కూడ‌దు అనే విష‌యాలే తెలీదు. స‌భామ‌ర్యాద అంటూ ఒక‌టి ఉంటుంది. దాన్ని పాటించ‌డం ఎప్పుడో మానేశాడు. అతి చ‌నువు అనుకోవాలో, అలీ అంటేనే ఇంత అని బాధ ప‌డాలో అర్థం కాదు. నోటికి ఏదొస్తే, ఎంతొస్తే అంత మాట్లాడేస్తాడు. ఈ విష‌యం చాలా సార్లు రుజువైంది. అత్తారింటికి దారేదిలో మ‌రోసారి అలీ వ్యవ‌హారం మ‌న‌సు నొచ్చుకొనేలా చేసింది. అలీ వేదిక‌పై ఎక్కి.. ”మ‌గ‌వాళ్లకు దిష్టి త‌గ‌ల‌దు. ఎందుకంటే కొత్త లారీల‌కు రెండు నిమ్మకాయ‌లు, ఒక మిర‌ప‌కాయ్ వేలాడ‌దీస్తారు. దిష్ట త‌గ‌ల‌కుండా.. అందుకే మాకు త‌గ‌ల‌దు..” అన్నాడు. ఇక్కడ రెండు నిమ్మకాయ‌లు, ఒక మిర‌ప‌కాయ్ అంటే అర్థం కాకుండా ఉంటుందా?? వేదిక‌పై సుమ‌, స‌భ‌లో వంద‌లాది మంది అమ్మాయిలు, టీవీ సెట్ల ముందు కూర్చున్న ల‌క్షలాదిమంది మ‌హిళా ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకోకుండా ఇలా మాట్లాడ‌డం అలీకి ఎంత వ‌ర‌కూ స‌బ‌బు? ఇప్పటికైనా మైకు చేతిలో ఉన్నప్పుడు అలీ కాస్త ప‌రిధి తెలుసుకొని మ‌సిలితే మంచిది.