కమెడియన్ అలీ తన కామెడీలలో ఎక్కువగా బూతులనే వాడుతాడు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలపై వివాదాస్పద కామెంట్‌లు చేసిన అలీ టాలీవుడ్ అగ్రకథానాయిక సమంతపై ఇది వరకు ఒకసారి కామెంట్ చేశాడు. సమంత నడుము బెజవాడ బెంజ్ సర్కిల్‌లాగా ఉంటుంది అని నోరు పారేసుకున్నాడు. దాంతో అలీ చేసిన కామెంట్ పెద్ద రచ్చకే దారి తీసింది. అది మర్చిపోయాడేమో కానీ అలీ తాజాగా మరోసారి సమంతపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రముఖ టీవీ ఛానెల్‌లో ప్రసారం అయ్యే దర్శకేంద్రుడి కార్యక్రమం ‘సౌందర్యలహరి’ షోలో సమంతపై నోరు పారేసుకున్నాడు.
మీకు ఏ హీరోయిన్‌తో నటించాలని ఉంది అని అలీని అడగగా సమంత అయితే సమ్మగా ఉంటుంది అని సమంతను కామెంట్ చేశాడు. సమంత ప్రస్తుతం కేవలం తెలుగు హీరోయిన్ మాత్రమే కాదు, తెలుగు సినీ పరిశ్రమలో పెద్దింటికి కోడలు కాబోతుంది. త్వరలో అక్కినేని వారింటికి కోడలిగా రాబోతున్న సమంతను సమ్మగా ఉంటుంది అని కామెంట్ చేసిన అలీపై ఎలాంటి యాక్షన్ ఉంటుంది అని ఆసక్తిగా మారింది. గతంలో అలీ సరాదాకు చాలామందిపై కామెంట్‌లు విసిరి వివాదాస్పదం అయ్యాడు. మరి సమంత ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటే అలీకి పెద్ద క్లాస్ తప్పదేమో.