Site icon TeluguMirchi.com

కాన్సర్ హీరోయిన్ ను కలుసుకున్న అక్షయ్..

బాలీవుడ్ బ్యూటీ సోనాలీ బింద్రే తాజాగా క్యాన్సర్‌ బారిన పడిన సంగతి తెల్సిందే. ‘కొన్ని సార్లు జీవితం నుంచి తక్కువగా ఆశిస్తుంటాం. జీవితం మలుపులతో కూడిన పరీక్షలాంటిది. నాకు ఇటీవల క్యాన్సర్‌ సోకింది. నిజానికి దీన్ని మేం ఏ మాత్రం ఊహించలేదు. అస్వస్థతగా అనిపిస్తే కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నా. అప్పుడు క్యాన్సర్‌ ఉందని బయటపడింది. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు నన్ను కలవడానికి వచ్చి పోతున్నారు. అత్యుత్తమ ఆదరణను నాకు అందిస్తున్నారు. ఇలాంటి వారు నా చుట్టూ ఉండటం నా అదృష్టం’ అంటూ నిన్న తన సోషల్ మీడియా పేజీ ద్వారా తనకు క్యాన్సర్‌ అనే సంగతి అభిమానులకు తెలియ చేసి షాక్ ఇచ్చింది.

ప్రస్తుతం ఆమె న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలియజేసింది. ఈ వార్త తెలుసుకున్న వెంటనే అక్షయ్ న్యూయార్క్‌లో ఆమెను కలిశారు. ఇటీవలే అక్షయ్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కోసం న్యూయార్క్ వెళ్లారు. అక్కడే ఉండటంతో వెంటనే వెళ్లి సోనాలికి ధైర్యం చెప్పారు. సోనాలిని కలిసిన అనంతరం, అక్షయ్ ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ.. ‘‘సోనాలి ధైర్యంగా పోరాడుతుందని నాకు తెలుసు. మంచి ఆరోగ్యంతో ఆమె తిరిగి వచ్చేందుకు భగవంతుడు ఆమెకు పూర్తి సహకారం అందిస్తాడు’’ అని తెలిపారు.

తెలుగులో ‘ప్రేమికుల రోజు’, ‘మురారి’, ‘ఇంద్ర’, ‘ఖడ్గం’, ‘మన్మథుడు’, ‘పలనాటి బ్రహ్మనాయుడు’, ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది సోనాలి. త్వరగా ఈమె ఆరోగ్యం గా తిరిగిరావాలని మనం కూడా కోరుకుందాం.

Exit mobile version