ఇటీవలే ఫోర్బ్స్ జాబితాలో ఇండియన్ సినీ స్టార్స్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న స్టార్ అక్షయ్ కుమార్ పేరు నిలిచిన విషయం తెల్సిందే. ఖాన్స్ త్రయం ఉండగా అక్షయ్ కుమార్ ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంవత్సరంకు రెండు మూడు సినిమాలు చేస్తున్న అక్షయ్ కుమార్ తన ప్రతి సినిమాతో 100 లేదా 200 కోట్లకు మించి వసూళ్లు చేస్తున్నాడు. దాంతో ఈయన పారితోషికం అమాంతం పెరిగి పోయింది. అయిదు ఆరు సంవత్సరాల క్రితం 15 నుండి 25 కోట్ల వరకు ఉన్న ఈయన పారితోషికం ఇప్పుడు ఏకంగా 55 కోట్లు.
ఇండియన్ సినీ స్టార్ ఎవరు కూడా ఈస్థాయి పారితోషికంను అందుకోవడం లేదు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా అక్షయ్ కుమార్ 50 నుండి 55 కోట్ల వరకు పారితోషికంను మాట్లాడుకుని సినిమాను చేస్తున్నాడు. ఇటీవల చేసిన మిషన్ మంగల్ చిత్రానికి కూడా ఏకంగా 40 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు ఈయన తీసుకున్న పారితోషికం 55 కోట్లుగా చెబుతున్నారు. ఇక అక్షయ్ ముందు ముందు మరెంత పారితోషికం తీసుకుంటాడో చూడాలి.