ఇక్క‌డ ర‌వితేజ‌.. అక్క‌డ అక్ష‌య్‌కుమార్‌

raviteja-akshay-kumarర‌వితేజ న‌టించిన సూప‌ర్‌ హిట్ సినిమా ‘విక్ర‌మార్కుడు’ని హిందీలో రీమేక్ చేసి హిట్ కొట్టాడు అక్ష‌య్‌కుమార్‌. ఇప్పుడాయన దృష్టి రాబోయే ‘ప‌వ‌ర్’ చిత్రంపైనా ప‌డింది. ర‌వితేజ-బాబి క‌ల‌యిక‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘ప‌వ‌ర్‌’. సెప్టెంబ‌రు 5న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఈ సినిమా హిందీ హ‌క్కుల్ని అక్ష‌య్‌కుమార్ చేజిక్కించుకొన్న‌ట్టు స‌మాచార‌మ్‌. దాదాపు రూ.2 కోట్ల‌తో రీమేక్‌ రైట్స్ కొనుగోలు చేశార‌ట‌. ప‌వ‌ర్ సినిమా ఇంకా విడుద‌ల కాక‌ముందే, ఆ సినిమా రిజ‌ల్ట్ తెలియ‌క‌ముందే.. రీమేక్ రైట్స్ ఇంత పెద్ద మొత్తానికి అమ్ముడు పోవ‌డం విశేష‌మే. ర‌వితేజ ‘కిక్’ కూడా హిందీలోకి వెళ్లింది. స‌ల్మాన్ ఖాన్‌ న‌టించిన ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్‌ ద‌క్కాయి. అందుకే అక్ష‌య్ కుమార్ ముందుస్తుగా క‌ర్చీప్ వేశాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచార‌మ్‌.