అక్షయ్ బ‌చ్చ‌న్ పాండే ఫస్ట్ లుక్ చూసారా..?

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్..వయసు పెరిగిన కొద్దీ సినిమాల జోరును పెంచుతున్నారు. ఓ సినిమా రిలీజ్ కు సిద్ధం అయ్యేలోపు మరో ప్రాజెక్ట్ ను ప్రకటిస్తూ అభిమానులు అలరిస్తున్నారు. ప్ర‌స్తుతం మిష‌న్ మంగ‌ళ్‌, గుడ్ న్యూస్‌, సూర్య‌వంశీ, ల‌క్ష్మీ బాంబ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటితో పాటు సాజిద్ న‌డియావాలా నిర్మాణంలో బ‌చ్చ‌న్ పాండే అనే చిత్రం చేస్తున్నాడు. ఫ‌ర్హాద్ సంజీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేసారు.

ఈ లుక్ లో అక్ష‌య్ కుమార్ నుదుటిపై విబూది,మెడలో రుద్రాక్షలు, నల్లని పంచె పెట్టుకొని అయ్య‌ప్ప వేష‌ధార‌ణ‌లో ఉన్నాడు. ఇంక‌ చేతిలో మార్షల్ ఆర్ట్స్ ఆయధమైన నాన్ చాక్ ఉండటం ఆసక్తిని రేపుతోంది. పక్క మాస్ మ‌సాలా ఎంట‌ర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతుందని అర్ధమవుతుంది. 2020 క్రిస్మ‌స్ కానుక‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. ఇక అక్ష‌య్ న‌టించిన మిష‌న్ మంగ‌ళ్ చిత్రం ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుంది.