Site icon TeluguMirchi.com

అక్కినేని వారి సంక్రాంతి కానుక‌

manam1మెగా ఫ్యామిలీ, నంద‌మూరి హీరోల నుంచి న్యూ ఇయ‌ర్ గిఫ్ట్ వ‌చ్చేసింది. ఘ‌ట్టమ‌నేని వాళ్లూ కొత్త సంవ‌త్సర కానుక ఇచ్చేశారు. సంక్రాంతికి ‘వ‌న్’ ఎలాగూ వ‌స్తోంది. ఇక కానుక‌లు లేనిది అక్కినేని హీరోల నుంచే. అందుక‌నేనేమో.. ఈ సంక్రాంతికి ‘మ‌నం’ టీజ‌ర్‌ ని విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు. నాగేశ్వర‌రావు, నాగార్జున‌, నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న చిత్రం ‘మ‌నం’. షూటింగ్ దాదాపుగా పూర్తయింది. మార్చిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. టీజ‌ర్ ని మాత్రం సంక్రాంతికి విడుద‌ల చేస్తారు. ‘వ‌న్’ ఆడుతున్న థియేట‌ర్లలో ‘మ‌నం’ టీజ‌ర్‌ని ప్రద‌ర్శించాల‌ని చిత్రబృందం భావిస్తోంద‌ట‌. అటు మ‌హేష్ సినిమా ఇటు.. మ‌నం.. చూస్తూ ఎంజాయ్ చేయాల్సిందే.

Exit mobile version