Site icon TeluguMirchi.com

మెగాస్టార్ సినిమాలో అక్కినేని హీరో..!


మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ ల క్రేజీ ప్రాజెక్ట్ “భోళా శంకర్”. ఈ మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో కీలక పాత్రల్లో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది. ట్యాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ఈ సినిమాలో చాలా ప్రత్యేకమైన , లవర్ బాయ్ తరహా పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ ఈరోజు అనౌన్స్ చేశారు. సుశాంత్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేశారు.

ఇక సుశాంత్.. లీడ్ రోల్స్ తో పాటు ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలని ఎంపిక చేసుకుంటున్నారు. భోలా శంకర్‌లో అతని పాత్ర చాలా కీలకంగా వుంటుంది. కాగా మహా శివరాత్రి సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన మోషన్ పోస్టర్‌ చిరంజీవిని ఫెరోషియస్ అవతార్‌లో ప్రజంట్ చేసింది. మిగతా ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Exit mobile version