Site icon TeluguMirchi.com

ఫ్యామిలి ఫ్యామిలికి త‌మ‌న్నానే కావాల‌ట‌..!

tamannaతండ్రి తోనూ, త‌న‌యుడితోనూ, వాళ్ల తాత‌తోనూ స్టెప్పులు వేసే అదృష్టం ఎవ‌రికి వ‌స్తుంది చెప్పండి. క‌నీసం ఆ ఊహ కూడా రాదు. త‌మన్నాకి ఆ అవ‌కాశం ద‌క్కింది. చేత‌ల్లో కాక‌పోయినా… క‌నీసం మాట‌ల వ‌ర‌కైనా ఇది సాధ్యమైంది. నాగ చైత‌న్యతో రెండు సినిమాలు చేసింది త‌మ‌న్నా. 100%ల‌వ్‌లో ఇద్దరి జోడీ బాగా కుదిరింది. ఇప్పుడు తడాఖాలోనూ ఈ జంట కనువిందు చేయ‌బోతోంది. ఈ ఆడియో వేడుక‌లో…. `నాక్కూడా త‌మ‌న్నాతో చేయాల‌ని ఉంది..` అని నాగార్జున త‌న మ‌న‌సులోని మాట బ‌య‌ట‌పెట్టాడు. పోనీ… ఆయ‌న వ‌య‌సు పెరిగినా ఇంకా యంగ్ లుక్‌లోనే ఉంటారు క‌దా? చూడ్డానికి పెద్ద ఇబ్బంది ఉండ‌దు అని అనుకొంటే, నాగేశ్వర‌రావు కూడా అదే పాట పాడారు. త‌మ‌న్నాకి చూస్తే… 25 యేళ్ల వ‌య‌సు వ‌చ్చేస్తుంద‌ట‌, స్టెప్పులు వేయాల‌ని అనిపిస్తుంద‌ట‌… ఇలా అక్కినేని త‌న‌దైన శైలిలో ఏవేవో మాట్లాడారు. అలా అక్కినేని ఫ్యామిలీ అంతా త‌మ‌న్నా మాయ‌లో ప‌డిపోయింద‌న్నమాట‌. విన‌డానికి ఇది స‌ర‌దాగానే అనిపించొచ్చు. కానీ అక్కినేని లాంటి లెజెండ్రీ న‌టుడు…. ఇలా వ‌య‌సు బేధం తెలియ‌కుండా మాట్లాడ‌డం ప‌రిశ్రమ‌లో చ‌ర్చనీయాంశ‌మైంది. త‌మ‌న్నా విష‌యంలోనేకాదు… ఇది వ‌ర‌కు అనుష్కకీ ఇదే డైలాగ్ అక్షరం పొల్లుపోకుండా చెప్పారు. ఆయ‌న ద‌గ్గరున్న స్టాక్ డైలాగ్ ఇదొక్కటేనేమో? అక్కినేని నాగేశ్వ‌ర‌రావు…. మ‌న క‌ళ్లుముందు మెదులుతున్న మ‌ధుర‌మైన జ్ఞాప‌కం. ఆయ‌న్ని తెలుగు సినీ అభిమానులంతా ఓ రేంజులో ఊహించుకొంటున్నారు. కానీ ఈ మాట‌లేంటి? ఆయ‌న స‌ర‌దాగానే అంటున్నా… విన‌డానికి మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటున్నాయి. అందెందుకు?? నాగార్జున‌, చైతూలు కూడా అక్కినేని మైకు అందుకొంటున్నప్పుడు కాస్త కంగారు కంగారుగానే ఉంటున్నారు. ఏం మాట్లాడేస్తాడో ఏమిటో అని! ఈ ఇబ్బందిని అక్కినేని ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.

Exit mobile version